Header Banner

అమెరికాను వణికిస్తున్న భారీ తుఫాన్.. ఎగిరిపోతున్న ఇళ్ల పైకప్పులు.! కొనసాగుతున్న టోర్నడోల విధ్వంసం!

  Fri Mar 07, 2025 10:35        U S A

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కరోలినా, దక్షిణ కరోలినా, ఫ్లోరిడా, వర్జీనియా రాష్ట్రాల్లో అధికారులు టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కరోలినాలో బలమైన గాలుల కారణంగా పలు నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. మిసిసిపీలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఓక్లహామాలో పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. టెక్సాస్, ఓక్లహామా, లూసియానాలలో ఇప్పటికే ఏడు టోర్నడోలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గాలులు తీవ్రంగా వీస్తుండటంతో టెక్సాస్‌లోని శాన్ పాట్రిసియో కౌంటీలో సంభవించిన కార్చిచ్చు కారణంగా 20కిపైగా ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పసిఫిక్ ప్రాంతం నుంచి రాబోతున్న పెను తుపాను కారణంగా నేడు భారీ వర్షాలు, హిమపాతం సంభవించనున్నట్టు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

 

ఇది కూడా చదవండి: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

 

మంచు దట్టంగా కురుస్తుండటంతో పలుచోట్ల రహదారులను మూసివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా టెక్సాస్‌లోని దాదాపు 51 వేల ఇళ్లు, వర్జీనియాలో 27 వేలు, టెన్నెసీలో 17 వేల ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దాదాపు 800 విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని గురువారం ఆల్ఫ్రెడ్ తుపాను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీని కారణంగా భారీ వర్షాలు కురవడంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వందల సంఖ్యలో పాఠశాలలను మూసివేశారు. క్వీన్స్‌లాండ్ బ్రిస్బేన్ నగరంపై ఈ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. న్యూ సౌత్‌వేల్స్ లో 4,500 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కేదార్‌నాథ్ రోప్‌వేకు గ్రీన్ సిగ్నల్… ఇక ప్రయాణం 36 నిమిషాల్లో పూర్తి! మోడీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం!

 

వైసీపీకి వరుస షాక్ లు.. వంశీ నుంచి మరింత సమాచారం.. బెయిల్​ ఇవ్వొద్దు.!

 

30 ఏళ్ల తర్వాత ఆసక్తికర దృశ్యం.. వెంకయ్యనాయుడులో పవర్, పంచ్‌లు తగ్గలేదు! మా రెండో అబ్బాయికి..

 

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #CycloneAlfred #Queensland #USA #Tornado